Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అముద శ్రీనివాస్, కారుణ్య చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'నా..ని ప్రేమకథ'. పీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అముద శ్రీనివాస్ దర్శకత్వంలో పోత్నక్ (శ్రవణ్ కుమార్) నిర్మిస్తున్నారు.
శనివారం ఈ సినిమా నుండి 'అందాలు చిందిస్తుంది..' పాటను సంస్థ కార్యాలయంలో మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ, 'ఒక ఊరిలో జరిగిన యదార్ధ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించాం. అందరి సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. లేటెస్ట్గా రిలీజ్ చేసిన 'అందాలు చిందిస్తుంది' పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది' అని తెలిపారు. 'ఓ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కు తున్న చిత్రమిది. ఇందులో హీరోగా చేయడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది' అని హీరో, దర్శకుడు అముద శ్రీనివాస్ చెప్పారు. 'సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి, త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం' అని ఎగ్జిక్యూటివ్ గుర్రపు విజరు కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి : ఎం.ఎస్ కిరణ్ కుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, సంగీతం ఎం.ఎల్.పి రాజా, రీ - రికార్డింగ్: చిన్నా.