Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా 'పుష్ప : ది రైజ్' చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు' అని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ తెలిపారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ''పుష్ప: ది రైజ్'. శుక్రవారం వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా శనివారం మైత్రి మూవీస్ అధినేతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ, 'అల్లు అర్జున్ నటనకి, యాక్షన్ సన్నివేశాలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్‌తో ప్రేక్షకులు ఘనస్వాగతం పలకడం హ్యాపీగా ఉంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది ఈ ఏడాదిలో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే నైజామ్ ఏరియాలో దాదాపు 11.5 కోట్లు షేర్ కలెక్ట్ చేసి, ఈ ఏరియాలో విడుదలైన తొలిరోజునే అత్యధిక వసూళ్ల రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు అందుకుంది' అని చెప్పారు.