Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నాయకానాయికలు విజరు, శీతల్ బట్ జంటగా సురేష్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఏ సురేష్ ప్రభు సమర్పణలో ఏ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై ఏ.ఆర్. రాకేష్ ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం ఆదివారం రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని హీరో, హీరోయిన్స్ పై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఏ.ఆర్. రాకేష్ మాట్లాడుతూ,'సురేష్ ప్రభు చెప్పిన కథల్లో ఈ సినిమా లైన్ వినగానే చాలా కొత్తగా, డిఫరెంట్గా ఉందనిపించింది. ఇది నా మొదటి చిత్రమైనా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా నిర్మిస్తున్నాను' అని తెలిపారు. 'స్క్రీన్ ప్లే పరంగా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, ఉత్కంఠభరితంగా సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఈ రోజు నుండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతాం' అని దర్శకుడు సురేష్ ప్రభు అన్నారు. మాటల రచయిత ప్రశాంత్ శర్మ మాట్లాడుతూ,'రెగ్యులర్ సినిమల్లా కాకుండా కొత్త ప్రయత్నం చేస్తున్నాం. స్క్రీన్ ప్లే మొత్తం ఉత్కంఠ భరితంగా ఉంటుంది' అని చెప్పారు. 'సైకలాజికల్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని మూల కథారచయిత గట్టు నరేందర్ చెప్పారు.