Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో, హీరోయిన్లుగా సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు' (ఎవరు, ఎక్కడ, ఎందుకు). సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన మిస్టరీ థ్రిల్లర్ ఇది. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం సోనిలివ్‌లో ఈనెల 24న రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎంపీ రఘురామకష్ణ రాజు అతిథిగా విచ్చేసి, రామంత్ర క్రియేషన్స్ బ్యానర్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. రాజశేఖర్ మాట్లాడుతూ, ''అద్భుతం' సినిమాకు ఎంత మంచి పేరు వచ్చిందో, శివానీ నటించిన ఈ సినిమాకి కూడా అంత మంచి పేరు వస్తుందని అంటున్నారు' అని చెప్పారు. 'నేను సినిమా చూశాను. అదిత్ చాలా బాగా చేశాడు. శివానీ కూడా కష్టపడి చేసింది' అని జీవిత రాజశేఖర్ అన్నారు. చిత్ర దర్శకుడు గుహన్ మాట్లాడుతూ, 'పూర్తిగా వెబ్ క్యామ్‌లో తీసిన సినిమా ఇది. ఆన్ లైన్లోనే నిర్మాత రవి గారు కథ విన్నారు. ఈ కథను నమ్మి మా మీద ఖర్చుపెట్టారు. ఆదిత్, శివానీ, సందీప్ చాలా బాగా నటించారు. తమ్మిరాజు ఎడిటింగ్, సైమన్ మ్యూజిక్, పొన్మని క్యాస్టూమ్స్, ఆర్ట్ వర్క్ ఇవన్ని ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కో ప్రొడ్యూసర్ విజరు ధరణ్ బాగా కష్టపడ్డాడు. మిర్చీ కిరణ్ గారితో '118'తో చేశాను. నాలుగు సినిమాలు చేశాం. ఇంకా మున్ముందు కూడా చేస్తాం' అని చెప్పారు.
'ఈ సినిమాను ముందుండి నడిపించిన జీవిత, రాజశేఖర్ గారికి థ్యాంక్స్. కేవీ గుహన్ గారి వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. మా సినిమాను చూసి దిల్ రాజు గారు మెచ్చుకున్నారు. సురేష్ బాబు గారు మా సినిమాను చూసి ఎంతో ప్రోత్సహించారు. యూఎఫ్ఓ లక్ష్మణ్ గారు మాతో మొదటి నుంచి కలిసి ప్రయాణం చేశారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, మాధవ్ బాగా సపోర్ట్ చేశారు. ఇదొక మెమోరబుల్ జర్నీ. శివానీ, అదిత్ అద్బుతంగా నటించారు. ఈ సినిమాను చూస్తుంటే కచ్చితంగా వేరే ప్రపంచంలోకి వెళ్తారు' అని నిర్మాత డా. రవి ప్రసాద్ రాజు ధాట్ల తెలిపారు.
హీరో అదిత్ మాట్లాడుతూ, 'ఇది మొట్టమొదటి కంప్యూటర్ స్క్రీన్ థ్రిల్లర్. అద్భుతమైన సంగీతాన్ని అందించిన సైమన్ గారికి థ్యాంక్స్' అని అన్నారు. 'అదిత్ వల్లే నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చినందుకు గుహన్ గారికి థ్యాంక్స్. ఇది నాకు చాలా మంచి అవకాశం' అని హీరోయిన్ శివానీ రాజశేఖర్ చెప్పారు.