Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన నూతన చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకత్యాన్ మాట్లాడుతూ, 'ఒక గొప్ప చిత్రం.. వెయ్యి చిత్రాలను తీసే గొప్ప శక్తినిస్తుంది. టికెట్ కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వొచ్చు లేదా ఐదేళ్లు కష్టపడి 'బాహుబలి'ని చూపించొచ్చు. ప్రేక్షకుడిని మరో లోకంలోకి తీసుకెళ్లాలని తపించే ప్రతీ ఒక్క మేకర్‌కి నా జోహర్లు. అలాంటి మరో ప్రయత్నమే మా 'శ్యామ్ సింగ రారు'. నాని గారు ఈ కథను నమ్మినంతగా ఎవరు నమ్మినా ఈ సినిమాను తీసేయోచ్చు. వంద కోట్ల బడ్జెట్ కూడా ఇవ్వలేని నమ్మకాన్ని మీరు నాకు ఇచ్చారు. తెలుగు ఇండిస్టీలో కొత్త నానిని చూడబోతోన్నాం. ఈనెల 24న మిమ్మల్ని థియేటర్‌కు పిలుస్తున్నాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్దాం. శ్యామ్‌ని కలవండి.. మిగతా పాత్రలతో మాట్లాడండి. మా సినిమా మీ కోసం ఎదురుచూస్తోంది' అని అన్నారు.
నాని మాట్లాడుతూ, 'ఇప్పుడు మా టీం అందరి కళ్లలో కనిపిస్తున్న ఫీలింగ్ ఈనెల 24న మీకూ తెలుస్తుంది. చాలా మంచి సినిమాను చేసి, మేం చూశాక.. ఆడియెన్స్‌కు చూపించేందుకు ఎక్కువ గ్యాప్ ఉండకూడదని ఈ సినిమాతోనే తెలిసింది. ఈ సినిమాని ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఎదురుచూస్తున్నాను. రాహుల్ సైడ్ నుంచి పెద్ద సర్ప్రైజ్ ఉండబోతోంది. వెంకట్ గారికి ఇది మొదటి సినిమా. ఆయన ఇంత కాలం పడిన కష్టానికి తగిన ప్రతి ఫలం దక్కుతుంది. ఈనెల 24న రాబోతున్నాం. క్రిస్మస్ మాత్రం మనదే' అని తెలిపారు. ఈ వేడుకలో దర్శకులు వేణు శ్రీరామ్, శైలేష్ కొలను, నిర్మాత అనిల్ సుంకర తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.
'నాకు ఈ ఇండిస్టీలో అవకాశాలు ఇచ్చినందుకు, నన్ను నమ్మి పాత్రలు ఇస్తున్న దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఇదంతా ఆడియెన్స్ నన్ను అంగీకరించినందు వల్లే జరిగింది. వారే నమ్మకపోయి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. ఇలాంటి చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేషనల్ అవార్డ్, ఆస్కార్ వచ్చినప్పుడే ఇలా ఏడుస్తానని అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు ఏడుపు వచ్చేసింది. నటిగా మారడమే నాకు పెద్ద అవార్డులా అనిపిస్తోంది
- సాయిపల్లవి