Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రీతనయులు చిరంజీవి, రామ్చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆచార్య'. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వస్తున్న పలు వార్తలను నిర్మాతలు ఖండించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 'మా 'ఆచార్య' సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4వ తేదీనే మా చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ పూర్తయ్యింది. ఎనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతతగా ఎదురు చూస్తున్నారు. అందరి అంచనాలకు తగినట్లే ఈ సినిమా ఉంటుంది' అని తెలిపారు.