Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షకలక శంకర్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం 'ధర్మస్థలి'. రొచిశ్రీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత ఎం.ఆర్. రావు నిర్మిస్తున్నారు. రమణ మోగిలి దర్శకుడు. పావని కథానాయిక. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్బంగా దర్శకుడు రమణ మోగిలి మాట్లాడుతూ, 'షకలక శంకర్‌తో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రాన్ని, ఇలాంటి కాన్సెప్ట్‌తో ఎవరూ తెరకెక్కించలేదు. ఇన్నాళ్ళు ఆయనలోని కామెడీ టైమింగ్ చూసిన వారికి ఆయనలో ఉన్న ఇంటెన్సిటి ఈ చిత్రం ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు మన జీవితాలతో ముడి పడిన ఓ విషయాన్ని, అలాగే మన జీవితాలతో ఆడుకుంటున్న అంశాన్ని ఆయన పాత్ర ద్వారా చూపించబోతున్నాం. ఇది పక్కా మాస్ కమర్షియల్ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రానికి 'ధర్శస్థలి' అనే టైటిల్‌ని ఖరారు చేశాం. ఈ టైటిల్‌ని ఎనౌన్స్ చేయగానే, భారీ బడ్జెట్ చిత్రాలకు వచ్చినంత రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. వినోద్ యాజమాన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని తెలిపారు. మని భట్టాచార్య, సన్ని సింగ్, షియాజి షిండే, ధనరాజ్, భూపాల్, భరత్, ఛత్రపతి శేఖర్, ముక్తార్, ఉన్ని కష్ణ, ఘని, విజరు భాస్కర్, మాధవి, హసిని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు : రాజేంద్ర భరధ్వాజ్, కెమెరా : జి.ఎల్.బాబు, ఎడిటర్ : వి.నాగిరెడ్డి, ఫైట్స్ : మల్లేష్, డాన్స్ : చంద్ర కిరణ్, ఆర్ట్ : సాంబ, లిరిక్స్ : గోసాల రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అకుతోట సంజు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం : రమణ మోగిలి.