Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ హీరోగా నటిస్తున్న సీట్ ఎడ్జ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'హిట్ 2'. హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను హీరో, చిత్ర సమర్పకుడు నాని విడుదల చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ చెందిన హిట్ టీమ్ ఆఫీసర్ కష్ణ దేవ్ అలియాస్ కె.డిగా అడివిశేష్ కనిపించబోతున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ, 'పోలీస్ ఆఫీసర్ డ్రెస్‌లో అడివి శేష్ ఏదో కేస్‌ను చేధించడానికి తన వంతు ప్రయత్నాలను చేయడం, తన లుక్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉండటం, తనతో పాటు ఓ పోలీస్ డాగ్ ఉండటాన్ని ఈ గ్లింప్స్‌లో చూపించారు. అలాగే విలన్ల భరతం పట్టే పోలీస్ ఆఫీసర్‌గానూ అడివి శేష్ కనిపిస్తున్నారు. ఇదే బ్యానర్లో రూపొంది ఘన విజయం సాధించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'హిట్' సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందుతున్న చిత్రమే 'హిట్ 2'. 'ది సెకండ్ కేస్' సినిమా ట్యాగ్‌లైన్. హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్ కొలను ఈ చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయ్యింది' అని చెప్పారు.
మీనాక్షి చౌదరి, రావు రమేష్, భాను చందర్, పోసాని కష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సినిమాటోగ్రఫీ: మణికందన్, నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్స్ ఎడురి, ఆర్ట్: మనీషా ఎ.దత్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్.