Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానస్ నాగులపల్లి హీరోగా నటించనున్న తాజా చిత్రం '5జి లవ్'. స్క్వేర్ ఇండియా స్టూడియోస్ బ్యానర్ పై ప్రతాప్ కోలగట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ ముదునూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'నిర్మాత ప్రతాప్ కోలగట్ల గతంలో '3జి లవ్' అనే యూత్‌ఫుల్, మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాన్ని నిర్మించారు. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఇప్పుడు '5జి లవ్' చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కథ ప్రకారం ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారు. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఈ చిత్రం రూపొందనుంది. బాలనటుడిగా, హీరోగా ప్రేక్షకుల్ని అలరించిన మానస్ ఇటీవల పాల్గొన్న 'బిగ్‌బాస్ 5'తో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే ఆయన నటించిన 'క్షీర సాగర మథనం' చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. అలాగే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ అనూహ్య స్పందన దక్కించుకుంది. ఈ సినిమాలో ఆయన పోషించే పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది' అని చెప్పారు. 'ఇప్పటివరకు చేసిన పాత్రలు, సినిమాలతో పోలిస్తే ఈ సినిమాతోపాటు నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో ఈ సినిమా ఉండబోతోంది. మేకింగ్‌లో మా నిర్మాత ప్రతాప్ కోలగట్ల ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని మరింత రిచ్‌గా నిర్మించబోతున్నారు' అని హీరో మానస్ తెలిపారు.