Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున, నాగచైతన్య, రమ్యకష్ణ, కతి శెట్టి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'బంగార్రాజు'. కళ్యాణ్ కష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ 'వాసివాడి తస్సాదియ్య..' అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'నాగార్జున, నాగ చైతన్య కలిసి స్టెప్పులు వేయటం, 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నటించటం, అలాగే ఈ పాటను స్వయంగా దర్శకుడు కళ్యాణ్ కష్ణ కురసాల రచించడం వంటి ఎన్నో ప్రత్యేకతలతో ఈ పాట ఉండటం విశేషం. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి ఈ పాటను అత్యద్భుతంగా ఆలపించారు. ఈ పాటలో నాగార్జున పంచెకట్టులో, నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో అలరించబోతున్నారు. ఇది కచ్చితంగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా మారుతుంది. ఇది వరకే విడుదల చేసిన 'లడ్డుండా', 'నా కోసం' పాటలకు విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా 'మనం'. అందులో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతున్న ఈ 'బంగార్రాజు' చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏకధాటిగా జరుగుతోంది' అని చెప్పారు.
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.