Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్ష, ప్రియా శ్రీనివాస్, అనన్యా పాణిగ్రహి, జాన్ కుషాల్, రఘు.జి, కవిత శ్రీరంగం, ఆర్యన్ గౌర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వధుకట్నం'. భార్గవ గొట్టిముక్కల దర్శకత్వంలో షేక్‌బాబు సాహేబ్ నిర్మించారు.
గ్రీన్ క్రాస్ థియోసోఫికల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సొసైటీ సమర్పణలో షబాబు ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైలర్‌ను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధానకార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. అయినప్పటికీ వారి పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఉండగానే ఆడ శిశువుల్ని చంపేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గింది. ఇది ఇలాగే కొనసాగితే.. పెళ్లి కోసం మగపిల్లలే ఆడపిల్లలకు 'వధుకట్నం' ఇవ్వాల్సి వస్తుందన్న మేసెజ్‌తో సినిమా తెరకెక్కించాం' అని చెప్పారు. 'అద్భుతమైన సందేశంతో ఉన్న మా సినిమాని ఈనెల 31న విడుదల చేస్తున్నాం' అని నిర్మాత షేక్‌బాబు సాహేబ్ అని అన్నారు.