Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోనీ అగర్వాల్ నటిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'డిటెక్టివ్ సత్యభామ'. సిన్మా ఎంటర్టైన్మెంట్ పతాకంపై నవనీత్ చారి దర్శకత్వంలో శ్రీశైలం పోలెమోని నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా సోనీ అగర్వాల్ మాట్లాడుతూ,''7జి బందావన్ కాలనీ' చిత్రం తర్వాత నాకు అంత గొప్పగా పేరు తెచ్చిన సినిమాలు లేవు. కానీ సెకండ్ ఇన్నింగ్స్‌లో అంత క్రేజ్ తెచ్చే సినిమా ఇది అవుతుంది. పోస్టుపొడక్షన్ మొత్తం ముంబైలో పూర్తి చేసి, ఫస్ట్ కాపీ నాకు చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా మరింత రీచ్ అవ్వడం కోసం ఈనెల 28 నుంచి హైదరాబాద్‌లో జరిగే ప్రమోషన్స్‌లో పాల్గొంటాను' అని తెలిపారు.
'ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా, అన్ని హంగులతో తీర్చి దిద్దాం.ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత శ్రీశైలం పోలెమోని అన్నారు. దర్శకుడు నవనీత్ చారి మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ఉన్న 4 పాటలతోపాటు యాక్షన్స్ సీక్వెన్స్‌లు కథలో భాగంగా ఉండి, అందర్నీ అలరిస్తాయి' అని చెప్పారు.