Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన గాయనీగాయకులను ప్రపంచానికి పరిచయం చేసే అత్యద్భుతమైన వేదిక జీ - సరిగమప. దీని కోసం ఔత్సాహిక గాయనీగాయకుల అన్వేషణను జీ తెలుగు ఆరంభించింది. ఇందులో భాగంగా ఈనెల 23న 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' పేరుతో హైదరాబాద్‌లో ఆడిషన్స్ నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ సందర్భంగా జీ తెలుగు ప్రతినిధులు మాట్లాడుతూ, 'తెలుగు టెలివిజన్‌లోనే అందరికి ఎంతో ఇష్టమైన రియాలిటీ షో 'స రి గ మ ప'. 13 సీజన్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న జీ తెలుగు 'స రి గ మ ప' తాజాగా మరోసారి అందరిని సరిగమలలో ఊయలలూగించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విజయనగరం, ఖమ్మం, విశాఖపట్నం, నెల్లూరు, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, కరీంనగర్, విజయవాడ, కర్నూల్లో ఆడిషన్స్ పూర్తి చేశాం. 2000కి పైగా ఆడిషన్స్ ఇచ్చారు. ఇక మన హైదరాబాద్‌లో ఈ నెల 23న ఆడిషన్స్ జరగబోతున్నాయి. 16 - 35 వయసు ఉన్న ఉండి, సంగీతం మీ నరనరాల్లో జీర్ణించుకొని ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే, ఇదే మీకు సువర్ణావకాశం. ఈనెల 23న పద్మాలయ స్టూడియోస్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగే 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' ఆడిషన్స్‌లో పాల్గొనండి' అని చెప్పారు.