Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి, ఆంజనేయులు (జూనియర్ రాజశేఖర్) నటించిన చిత్రం 'పంచనామ'. హార్దిక్ క్రియేషన్స్ పతాకంపై సిగటాపు రమేష్ నాయుడు దర్శకత్వంలో గద్దె శివకష్ణ, వెలగ రాము సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారి వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా అగ్ర దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్‌ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'వెంప కాశీని ఎన్నోసార్లు సినిమాల్లో నటించమని అడిగినా చేయని వ్యక్తి, ఈ సినిమాలో చేశారని విని, షాకయ్యా. ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ గురించి విన్న తర్వాత, ఆయనకు ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి మనస్పూర్తిగా దీవెనలు తెలియజేస్తున్నా. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలగడం విశేషం' అని చెప్పారు. 'నాకు ఇష్టమైన డైరెక్టర్స్‌లో వి.వి వినాయక్ ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీ నింపాయి. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది' అని డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు తెలిపారు.