Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెెరకెక్కించిన చిత్రం 'పుష్ప : ది రైజ్'. రష్మిక కథానాయిక. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన అన్ని చోట్లా విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఏర్నేని, రవిశంకర్, చెర్రీ మాట్లాడుతూ, 'తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా అన్ని ప్రాంతాల నుంచి అద్భుతమైన కలెక్షన్లు వస్తున్నాయి. తొలి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.173కోట్ల గ్రాస్ రాబట్టింది. దాదాపు రూ.80 కోట్ల షేర్ వచ్చింది. సాధారణంగా ఆదివారం తర్వాత ఏ సినిమాకైనా కొంచెం వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ, మా 'పుష్ప' సోమవారం కూడా బలంగా నిలబడింది. ఓవర్సీస్లో 2 మిలియన్ మార్క్‌ను చేరుకోబోతుంది. ఇంత పెద్ద విజయాన్ని మేం అసలు ఊహింలేదు. మాకు మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా కతజ్ఞతలు. మార్చి నుంచి 'పుష్ప : ది రూల్' సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తాం' అని చెప్పారు.