Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. తేజ మర్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాలోని 'ఒక తీయని మాటతో...' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది.
'ఈ పాటలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ అమత అయ్యర్‌తో ఉన్న రిలేషన్లోని ఆనందాన్ని వ్యక్తం చేసే రొమాంటిక్ మెలోడీ. ఈ పాటకు చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. శశ్వత్ సింగ్, శ్రేయా అయ్యర్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. విజువల్గానూ ఈ పాట చక్కగా, లవ్లీగా కనిపించడం విశేషం. ఇప్పటికే ఈ చిత్ర టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని ఈనెల 31న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.