Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపతి రెడ్డి, శ్వేతా నాయర్, మేఘన చౌదరి నటీ నటులుగా రూపొందిన చిత్రం 'గెలుపు గీత దాటితే..?'. రఘు క్రియేటివ్ ఫిలిమ్స్ పతాకంపై శివకాళి గోపాల్ దర్శకత్వంలో రఘు.ఎన్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలతో మా చిత్రాన్ని జనవరి 1న విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. 'గెలుపు అనేది ప్రతి మనిషికి కావాలి. ఈ సినిమాలో గెలుపు ఏంటనేది స్క్రీన్ పై చూస్తారు. టీజర్లో చూసినట్టు సినిమా చాలా బాగా ఉంటుంది. ఇందులో చాలా మంచి కథ ఉంది' అని దర్శకుడు అన్నారు.
హీరో భూపాల్ రెడ్డి మాట్లాడుతూ,'ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కామెడీ, రొమాన్స్, యాక్షన్‌తో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి. ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని తెలిపారు. 'ఇందులో నాలుగు డిఫరెంట్ రోల్స్ చేశాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుంది' అని హీరోయిన్ మేఘన చౌదరి చెప్పారు.