Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు, అమతా అయ్యర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అర్జున ఫల్గుణ'. ఎన్.ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 31న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా నాయిక అమతా అయ్యర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఈ స్క్రిప్ట్ ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. రాజమండ్రిలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇందులో అన్ని రకాల జోనర్లు ఇందులో ఉంటాయి. పరిస్థితులు అనుకూలించకపోయినా ఫ్రెండ్ కోసం నిలబడటమనే పాయింట్‌తోపాటు ఫ్రెండ్ అంటే జెండర్ చూడకూడదు. అవసరంలో సాయం చేయాలనేది నాకు బాగా నచ్చింది. కథానుసారం 50 శాతం చిత్రీకరణ అడవుల్లోనే ఉంటుంది. దీంతో చిత్రీకరణలో పాల్గొనడం, సన్నివేశాల్లో యాక్ట్ చేయటం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. శ్రీ విష్ణుతో ఇదే మొదటి సినిమా. ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా. మేం ఇద్దరం నటించినట్టు ఉండదు.. యాక్షన్ రియాక్షన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జోహర్' సినిమా చూశాను. ఆయనకి ప్రతి విషయం చాలా క్లారిటీ ఉంటుంది. 'రెడ్', '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'' సినిమాల పరంగా సంతప్తిగా ఉన్నాను.
నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశాను. వీటికి మంచి రివ్యూలు కూడా వచ్చాయి. నాకు సెట్ అయ్యే పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను. హద్దులు పెట్టుకోలేదు. ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. గ్లామర్ రోల్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉండదు. సినిమాల్లోకి వచ్చాకే తెలుగు నేర్చుకున్నాను. హీరోల్లో అల్లు అర్జున్, హీరోయిన్ సమంత అంటే ఇష్టం. ప్రస్తుతం 'హనుమాన్' సినిమా చేస్తున్నాను' అని తెలిపారు.