Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా బుధవారం హీరో నాని మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 'ఈ సినిమాకి అద్భుతమైన కథ దొరికింది. కథే కాకుండా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అదే స్థాయి వాళ్ళు దొరికారు. కమల్‌హాసన్ 'నాయకుడు' సినిమాలా ఉంటుందా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి, దీనికి సంబంధం ఉండదు. ఇందులో నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయి. అవి వచ్చినప్పుడు కచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ అవుతాయి. 'శ్యామ్ సింగ రారు' పోరాటం చెడు మీద. చెడు అనేది రకరకాలుగా ఉంటుంది. అందులో దేవదాసీ వ్యవస్థ కూడా ఉంటుంది. అప్పట్లో ఉండే దురాచారాలపై పోరాటం చేసే కమ్యూనిస్ట్ శ్యామ్ ప్రేమలో పడితే?, అతను ఎలా మారుతాడు అనేది సినిమా. ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ. పూర్తిగా కల్పితం. 'జెర్సీ' తర్వాత నాకు ఎంతో సంతప్తినిచ్చిన సినిమా ఇది. దర్శకుడు రాహుల్‌కి లిటరేచర్ మీద బాగా గ్రిప్ ఉంది. అలాంటి వ్యక్తి పీరియడ్ సినిమా తీస్తే, ఇంకెంత డీటైల్డ్‌గా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సిరివెన్నెల గారు మా కోసం రాసిన పాట చివరి పాట అవుతుందని ఊహించలేదు. ఆయనకు నివాళిగా ఈ సినిమా మొదలవుతుంది' అని నాని తెలిపారు.
నా తదుపరి చిత్రాల్ని దక్షిణాది భాషలన్నింటిలోనూ రిలీజ్ చేస్తాం. అలాగే మంచి కథ దొరికితే, బాలీవుడ్‌లోనూ యాక్ట్ చేసేందుకు రెడీగా ఉన్నా. తెలుగులో ఇప్పటి వరకు టచ్ చేయని కలర్, జోనర్లో 'దసరా' సినిమా ఉంటుంది. అలాగే 'అంటే సుందరానికీ' సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ఏప్రిల్‌లో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.