Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్ణ ప్రధాన పాత్రలో, తేజ త్రిపురాన హీరోగా రూపొందుతున్న చిత్రం 'బ్యాక్ డోర్'. ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని డేట్ రెస్టారెంట్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మేకర్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు. నటి, దర్శక, నిర్మాత జీవితా రాజశేఖర్, అడిషనల్ ఎస్.పి. కె.జి.వి.సరిత, నాయిక పూర్ణ, హీరో తేజ త్రిపురాన, దర్శకుడు కర్రి బాలాజీ, సంగీత దర్శకులు ప్రణవ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, టి.రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, శోభారాణి, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, దర్శకులు వీరశంకర్ తదితరులు పాల్గొని 'బ్యాక్ డోర్' బ్లాక్ బస్టర్ కావాలని ఆకాంక్షించారు. 'ఇలాంటి ఓ మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కర్రి బాలాజీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇందులో నా పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది. 'ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌కి తగ్గట్టు, భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈనెల 25న విడుదల చేస్తున్నాం' అని కె.ఆర్.ఫిల్మ్ ఇంటర్నేషనల్ అధినేత కందల కష్ణారెడ్డి చెప్పారు. 'పూర్ణ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది' అని దర్శకుడు కర్రి బాలాజీ చెప్పారు.