Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ సంకత్యాన్ మాట్లాడుతూ, 'మంచి సినిమా తీశామన్న నమ్మకం ఉంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్ వండర్‌ను థియేటర్లో చూడాల్సిందే. మీరు సినిమాని చూసి మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి' అని చెప్పారు. 'మా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి. కొత్త అనుభూతిని ఇస్తామనే నమ్మకం మాకుంది. అందుకే నాలుగు భాషల్లో తీశాం. ఇలాంటి సినిమాని తీసినందుకు ఎంతో గర్వంగా ఉంది. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, పోతారు కానీ.. ఇలాంటి సినిమాను నిర్మించే అవకాశం అందరికీ రాదు' అని నిర్మాత వెంకట్ బోయనపల్లి చెప్పారు.
నాయిక సాయి పల్లవి మాట్లాడుతూ, 'మీ అంచనాలు అందుకునేలా ఈ సినిమా ఉంటుంది. ఇందులో నాకే నచ్చిన పాత్రని చేశా' అని అన్నారు.
నాని మాట్లాడుతూ, 'రిలీజ్ ముందు రోజు చాలా టెన్షన్ ఉంటుంది. కానీ ఓ మంచి సినిమా తీశామనే ఫీలింగ్ మాత్రం ఉంది. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో చాలా కొత్త విషయాలున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఇదే అవుతుంది. ఇందులో ఎమోషనల్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాసు నార్మల్ కారెక్టర్. శ్యామ్ ప్రపంచం వేరు. నేను కూడా ఓ ప్రేక్షకుడినే. నాకు నచ్చింది ప్రేక్షకుడికి నచ్చుతుందనిపిస్తుంది. ఈ సినిమా హిట్ అవుతుందనే అందరూ చెబుతారు. నేను కూడా ఎంతో నమ్మకంగా, కాన్ఫిడెంట్‌గా చెబుతున్నా ఇది కచ్చితంగా హిట్టే. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా సరే, దాన్ని దాటే సినిమాని చేశామని నాతోపాటు మా యూనిట్ అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.