Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్ కథానాయకుడిగా తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రాన్ని నిర్మించేందుకు సితార ఎంటర్టైన్మెంట్స్ రంగం సిద్ధం చేసింది. తమిళ వెర్షన్‌కు 'వాతి', తెలుగు వెర్షన్‌కు 'సార్' అనే టైటిల్ ఖరారు చేస్తూ, వీటి టైటిల్ లుక్ మోషన్ పోస్టర్లను నిర్మాతలు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'టైటిల్ రివీల్ వీడియోలో ఈ సినిమా 'యాన్ యాంబిషియస్ జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్' అని చెప్పారు. ఈ మోషన్ పోస్టర్ ప్రకారం ధనుష్ ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్‌గా నటించనున్నారని తెలుస్తోంది. టైటిల్ డిజైన్‌లో పెన్నుపాళీ కనిపిస్తోంది. ఇదొక పీరియాడికల్ మూవీగా, హీరో తన కలం బలంతో స్టూడెంట్స్‌కు రోల్ మోడల్ అవుతాడని వేరే చెప్పక్కర్లేదు. ఓ ఉద్వేగభరితమైన, ఉత్తేజకరమైన కథను మేకర్స్ మన ముందుకు తీసుకు రాబోతున్నారనే నమ్మకం కలుగుతోంది. ఇదే బ్యానర్లో ఇటీవల 'రంగ్‌దే' చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నేతత్వంలోని సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్)తో కలిసి నిర్మిస్తున్నారు. కేరళకు చెందిన ఛార్మింగ్ సెన్సేషన్ సంయుక్తా మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా దినేష్ కష్ణన్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ చిత్రానికి పని చేయనున్నారు. జి.వి. ప్రకాష్‌కుమార్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ జనవరిలో మొదలు కానుంది' అని తెలిపింది. సాయికుమార్, తనికెళ్ల భరణి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్), ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.