Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'1983లో భారత క్రికెట్ జట్టు కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పుడు ప్రతి భారతీయుడు కాల రెగరేసుకుని తిరిగారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ఆ చారిత్రక సంఘటనతో తెరకెక్కిన '83' చిత్రాన్ని నేటి యువత చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు. '83' చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో విష్ణు ఇందూరి నిర్మించారు.
1983 ప్రపంచకప్, కపిల్ దేవ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం '83'. రణ్వీర్ సింగ్, దీపిక పదుకొనె కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కబీర్‌ఖాన్ దర్శకుడు. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు, ప్రాంతీయ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాని తెలుగులో నాగార్జున విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ, 'నటనారంగంలో ఉన్న వాళ్లకు సరికొత్త పాత్రలు చేయాలన్న పిచ్చి ఉంటుంది. అదే నన్ను కపిల్ పాత్ర పోషించేలా చేసింది. ప్రపంచకప్ గెలుపొందిన టీమ్‌లో ఉన్న సభ్యులందరూ వారి కుటుంబాలతో కలిసి, ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సినిమా కోసం కపిల్‌దేవ్‌తో కొన్నాళ్లు ప్రయాణం చేయడం నా జీవితంలో మర్చిపోలేనిది' అని అన్నారు. 'ఇలాంటి మధురానుభూతులను తెరపై చూపించడం కోసం మేం చాలా రీసెర్చ్ చేశాం' అని దర్శకుడు కబీర్ ఖాన్ చెప్పారు.
కపిల్ దేవ్ మాట్లాడుతూ, 'కబీర్‌ఖాన్ '83'ని రెండు భాగాలుగా చూపించారు. ఒకటి క్రికెట్, మరొకటి ఫ్యామిలీ. రెండింటినీ మిళితం చేసి చూపించటం చాలా బాగుంది. నాటి టీమ్ ఇండియా సభ్యులు, వారి కుటుంబం, తల్లిదండ్రులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి సినిమాను చూశారు. చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం' అని తెలిపారు.
''83'లో రణ్వీర్ సింగ్ నాకు కనిపించలేదు. కేవలం కపిల్‌దేవ్ మాత్రమే కనిపించాడు. సినిమా చూసిన తర్వాతే కపిల్‌దేవ్ వ్యక్తిగత జీవితం గురించి తెలిసింది. ఇప్పటివరకూ ఆ విషయాలు ఏవీ నాకు తెలియవు. ఆయన సింప్లీసిటీకి హ్యాట్సాఫ్. నాగార్జున నాకు ఇంజనీరింగ్‌లో క్లాస్మేట్. చదువయ్యాక నేను క్రికెట్ ఆడ్డానికి బ్యాట్ పట్టుకుంటే, నాగార్జున చైన్ పట్టుకుని శివ అవతారమెత్తాడు' అని శ్రీకాంత్ కష్ణమాచారి అన్నారు.