Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెకె సినిమాస్ పతాకంపై శివకళ్యాణ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కళ్యాణ్ రావునిర్మిస్తున్న చిత్రం 'తురుమ్ ఖాన్లు'. దాదాపు 50 మందికి పైగా నూతన, థియేటర్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా పోస్టర్ ఐడియా ఇన్నోవేటివ్‌గా ఉంది. డైరెక్టర్ శివకళ్యాణ్ నా సినిమాలకు వర్క్ చేశాడు. నేనే తనతో సినిమా చేయాల్సింది. కుదరలేదు, తన రైటింగ్, కామెడీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో ఇండిస్టీలో మంచి డైరెక్టర్‌గా నిలబడతాడని ఖచ్చితంగా చెప్పగలను' అని చెప్పారు.
'బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఒకే ఊరిలో పుట్టి, గొడవపడుతూ లలిత, భారతి, పద్మలను చేరుకునేందుకు ఆరాటపడుతుంటే అక్కడే పుట్టిన శ్రీకష్ణుడు ఆ చిక్కుముడిని ఎలా విప్పాడనేది ఈ చిత్ర కథ. డార్క్ హ్యూమర్ జానర్లో వస్తోన్న ఈ చిత్రం అందరిని అలరిస్తుంది' అని డైరెక్టర్ శివకళ్యాణ్ తెలిపారు.