Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్కై జాయింట్ వెంచర్స్ 'మిస్టర్ అండ్ మిస్ ఏషియా' ఈవెంట్‌ని నిర్వహిస్తోంది.
ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి, తెలంగాణ విద్యుత్, వ్యవసాయ శాఖ సలహాదారు డా.వేణుగోపాలచారి లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అందాల పోటీలు ఆత్మస్థైర్యాన్ని పెంచుతాయి. పాపులారిటీకి, సినిమా రంగానికి రాచబాటలు వేస్తాయి. 'మిస్టర్ అండ్ మిస్ ఏషియా' పోటీలకు హైదరాబాద్ వేేదిక కావడం గర్వకారణం' అని చెప్పారు. 'ప్రముఖ సినీ దర్శకులు, నటులు, నత్య దర్శకులు సలీం ఇలాహి వంటి ప్రముఖులు ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 2021-22 సెలెక్షన్స్ని బంజారాహిల్స్‌లోని అట్లాస్ అపార్టుమెంట్లో నిర్వహించబోతున్నాం. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఢిల్లీ, చండిఘర్, భోపాల్, లక్నో, పూణే, బెంగళూరు వంటి ప్రముఖ పట్టణాల నుంచి 1000కి పైగా ఎంట్రీలు వచ్చాయి. జనవరి 30, 2022న జరిగే ఫైనల్స్‌కి మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖాండేవాల్, మిస్టర్ ఇండియా స్టైల్ ఐకాన్ లక్ష్య శర్మ న్యాయ నిర్ణేతలుగా ఉంటారు' అని స్కై జాయింట్ వెంచర్స్ సహ వ్యవస్థాపకురాలు, నటి మిస్ ప్రియాన్షా దూబే తెలిపారు.
'యువతను ప్రోత్సహించడానికి ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నాం. ఫె˜ౖనల్స్లో 100 మంది ప్రతిభావంతులైన యువత పాల్గొంటారని ఆశిస్తున్నాం' అని డ్రీమ్ మేకర్స్ ప్రొడక్షన్స్ ఎమ్.డి మీర్జా ఇంతియాజ్ బేగ్ చెప్పారు.