Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫ్యామిలీ డ్రామా, డార్క్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, రియాలిటీ టీవీ.. ఇలా అన్ని రకాల జోనర్లను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రంగం సిద్ధం చేసింది.
తెలుగులో రాబోతున్న ఫస్ట్ ఒరిజినల్ హాట్ స్టార్ స్పెషల్ సిరీస్ ''పరంపర''తో జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర అలరించబోతున్నారు. నాగార్జున హౌస్ట్‌గా 'బిగ్ బాస్' లైవ్ షో రాబోతోంది. క్రిష్ డైరెక్షన్లో తారక రత్న, అజరు కాంబినేషన్లో థ్రిల్లింగ్ బ్యాంక్ రాబరీ '9 అవర్స్' అనే చిత్రం రానుంది. మహిళలు, చిన్నపిల్లల మీద జరిగే నేరాలపై 'ఝాన్సీ' అనే సినిమా, మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో 'సైతాన్' అనే హారర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అయ్యాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అగ్ర హీరో నాగార్జున మాట్లాడుతూ,'ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచం అత్యంత వేగంగా అభివద్ది చెందుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి' అని చెప్పారు.
'అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుంది' అని జగపతిబాబు అన్నారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రెసిడెంట్, హెడ్ సునీల్ రాయన్, డిిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్, హెచ్ఎస్ఎమ్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, స్టార్, డిస్నీ ఇండియా ప్రెసిడెంట్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, 'ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాం. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాం. తెలుగు చిత్రసీమలోని అద్భుతమైన వ్యక్తులతో కలిసి ఎన్నో ప్రాజెక్ట్‌లను తెరకెక్కిస్తున్నాం' అని తెలిపారు.