Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'అర్జున ఫల్గుణ'. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తేజ మర్ని దర్శకత్వంలో ఈ సినిమాని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఎన్.ఎమ్.పాషా సహ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు కొరటాల శివ రిలీజ్ చేశారు.
'డిగ్రీ కంప్లీట్ చేసి, తన ఫ్రెండ్స్‌తో జాలీగా తిరిగే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నారు. ఇక అదే ఊర్లో అమ్మాయిగా అమతా అయ్యర్ ఆ గ్యాంగ్‌లో చేరుతుంది. జాలీగా ఉన్న వీరి జీవితాల్లోకి అనుకోని ప్రమాదాలు వస్తాయి. అవి ఏంటి?, వారిని ఎవరు వెంటాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. దర్శకుడు ఓ కమర్షియల్ సబ్జెక్ట్‌ను ఎంతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లో మంచి అనుభూతిని ఇస్తుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. శ్రీ విష్ణు ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నారు. అమతా అయ్యర్ పాత్ర చక్కగా కుదిరింది. సుబ్బరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రాన్ని ఈనెల 31న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.