Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మ్యాక్ వుడ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్, కనకదుర్గ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రుద్రాక్షపురం'. నాగమహేశ్, రాజేంద్ర, జీవ, సాయి మణితేజ, వైడూర్య, పవన్ వర్మ, సునిత, రేఖ, రాజేశ్ రెడ్డి, వీరబాబు, సురేష్ కొండేటి, ఆనంద్, అక్షర నిహా నటిస్తున్నారు.
నాలుగవ షెడ్యూల్లో కోసం అనంతపురం వెళ్తున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'సినిమా వాళ్ళ కథలు, వ్యధలు ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ఒక పాట, ఫైట్ మిగిలి ఉంది. ఈ ఫైట్‌ను థ్రిల్లర్ మంజు చేస్తున్నారు' అని చెప్పారు. 'నేను నిర్మించిన 'బ్యాట్ లవర్స్' సినిమా వచ్చే నెలలో విడుదలవుతుంది. ఇదొక డిఫరెంట్ సినిమా' అని నిర్మాత తెలిపారు. 'ఈ సినిమాలో దర్శకుడి పాత్రని పోషిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని వీరబాబు చెప్పారు.
సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'దర్శకుడు గాంధీ కథ చెప్పగానే నచ్చింది. ఇప్పటివరకు నేను కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఫైట్స్ చేయలేదు. ఫస్ట్‌టైమ్ ఇందులో చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది' అని తెలిపారు.