Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ విష్ణు, అమతా అయ్యర్ జంటగా ఎన్.ఎమ్. పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం 'అర్జున ఫాల్గుణ'. తేజ మర్ని దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. ఈనెల 31న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు తేజ మర్ని శనివారం మీడియాతో ముచ్చటించారు.
'ఈ సినిమాలో హీరో కారెక్టర్ పేరు అర్జున్. ఊర్లో ఉన్నంత సేపు అర్జునుడు. ఊరి దాటాక ఫల్గుణుడిగా ఎలా మారాడన్నదే కథ. సిటీలో ఎంత సంపాదించినా మిగిలేది కొంతే. అదే ఊర్లో ఉండి సంపాదించుకుంటే బెటర్ కదా? అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అలాంటి ఊరి కుర్రాళ్ల కథే ఈ సినిమా. 'అర్జున ఫల్గుణ' అనే టైటిల్ పెట్టాకే సినిమా స్పాన్ మారిపోయింది. ఈ సినిమాలో గోదావరిలోని అందాలను కొత్త కోణంలో చూపించబోతున్నాం. దర్శకులు వంశీ, కష్ణవంశీ గారి ప్రభావం నాపై ఉంది. ఈ సినిమాలోని మెయిన్ పాయింట్, టర్నింగ్ సీన్స్, కథలు నిజంగానే జరిగాయి. నా ఫ్రెండ్స్, వాళ్ల ఫ్రెండ్స్ ఇలా అందరి జీవితాల్లో జరిగిన వాటిని ఈ కథలో పెట్టాను. సినిమాలోని ఐదు పాత్రలు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్. రియలిస్టిక్‌గా ట్రీట్ చేశాం. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ద్వితీయార్థంలో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటి? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక క్లైమాక్స్‌లో అయితే అందరూ ఎమోషనల్ అవుతారు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2, షైన్ స్క్రీన్ బ్యానర్లలో సినిమాలు చేస్తున్నా. ఇకపై కమర్షియల్ సినిమాలు చేస్తా. నేను ఏ సినిమా చేసినా కూడా ఎమోషన్ ఉండాల్సిందే' అని తేజ మర్ని చెప్పారు.