Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగరారు'. ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకా దరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో నాయిక కృతిశెట్టి శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. 'ఉప్పెన', 'శ్యామ్ సింగ రారు' సినిమాల్లోని పాత్రలకు చాలా తేడా ఉంది. నాకు వచ్చే పాత్రలపై నేనే రీసెర్చ్ చేస్తాను. ఈ సినిమాలోని పాత్ర కోసం స్మోకింగ్ చేయాల్సి వచ్చింది. బేసిగ్గా నాకు స్మోకింగ్ అంటే అస్సలు నచ్చదు. కానీ ఈ పాత్ర కోసం ఛాలెంజింగ్‌గా చేశా. నాని గారితో నటించడమంటే మొదట్లో భయం వేసింది. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే చాలా కంఫర్ట్‌గా నటించగలిగా. మా నాన్న సినిమా చూసి నన్ను మెచ్చుకున్నారు. ఆయన ఎప్పుడూ కూడా సెట్లోకి రారు. నా లుక్ గురించి తెలీదు. కొత్తగా, ఫ్రెష్‌గా ఉందని అన్నారు. 'ఉప్పెన' సినిమాలో నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. అయితే ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే ఛాన్స్ వచ్చింది. నా పాత్రకు డబ్బింగ్ చెబుదామని ట్రై చేశా. కానీ క్యారెక్టర్ లుక్‌కి, నా వాయిస్‌కి మ్యాచ్ అవ్వలేదు. 'బంగార్రాజు', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'మాచర్ల నియోజకవర్గం'తోపాటు రామ్‌తో సినిమా చేస్తున్నాను. బాలీవుడ్ ఆఫర్లు రాలేదు. నేను ఏ సినిమాని అంగీకరించినా అందులో నా పాత్రకు ప్రయారిటీ ఉండాలి. అలా ఉంటేనే యాక్ట్ చేస్తా' అని తెలిపింది.