Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాత నాగం తిరుపతి రెడ్డి
ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన 'తీస్ మార్ ఖాన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించారు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
శనివారం నిర్మాత నాగం తిరుపతి రెడ్డి పుట్టిన రోజు. ఆయన బర్త్ డే వేడుకను విజన్ సినిమాస్ ఆఫీసులో 'తీస్ మార్ ఖాన్' టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా విజన్ సినిమాస్ నుంచి మరో చిత్రాన్ని నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఎనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''తీస్ మార్ ఖాన్' రషెస్ చూశాక సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. నా తదుపరి సినిమాని కూడా దర్శకుడు కళ్యాణ్ జి గోగణతో, ఆది సాయి కుమార్ హీరోగా చేయబోతున్నా. ఇకపై ఆదితో ప్రతి ఏడాది ఓ సినిమా చేస్తాను' అని తెలిపారు.
'విజన్ సినిమాస్ ప్రొడక్షన్ నెం4 రూపంలో మరోసారి అదే టీమ్‌తో కలిసి పని చేయనుండటం ఆనందంగా ఉంది' అని ఆది సాయి కుమార్ చెప్పారు.
దర్శకులు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ''తీస్ మార్ ఖాన్' సినిమాలో ఆది సాయి కుమార్ తన నటనతో అబ్బురపరిచారు. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి ఎంతో సపోర్ట్ చేస్తూ, ఖర్చు విషయంలో వెనకాడలేదు. మాతో ఆయన మరో సినిమా చేయటం సంతోషంగా ఉంది' అని అన్నారు.
''తీస్ మార్ ఖాన్' సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం ఆది సాయి కుమార్ చాలా కష్టపడ్డారు. త్రి షేడ్స్‌లో ఆయన నటనలోని ఎలివేషన్స్ బయటపడతాయి. నిర్మాత నాగం తిరుపతి రెడ్డి చాలా ప్రామిసింగ్‌గా ఉంటారు. 'తీస్ మార్ ఖాన్' కలెక్షన్స్ బాగా రావాలని కోరుకుంటున్నా' అని సునీల్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తిర్మల్ రెడ్డి యాళ్ళ.