Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్‌తేజ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'గని'. అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ , 'వరుణ్ తేజ్ 'గని' అనే సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రీసెంట్గా విడుదలైన టీజర్, సినిమా ప్రోమో, సాంగ్స్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్లో నిర్మించాం. ఇలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్స్‌పైనే ఎంజారు చేస్తే ఆ కిక్ మరో రేంజ్లో ఉంటుంది. అందుకే మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. వచ్చే ఏడాది మార్చి 18న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం' అని అన్నారు.
సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జార్జ్ సి.విలియమ్స్, మ్యూజిక్: తమన్.ఎస్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్.