Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీతా ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఎమ్.ఆర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ సమర్పిస్తున్న చిత్రం 'దిల్ తో పాగల్ హై'. ఎస్.సోమరాజు నిర్మాతగా, సతీష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ నూతన చిత్ర పూజా కార్యక్రమాలు ఆదివారం ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగాయి. 'శ్యామ్ సింగరారు' ఫేమ్ రవి తేజ్, మిస్ మహారాష్ట్రగా గెలుపొందిన అనిత షిండే హీరో, హీరోయిన్లు. వీరిపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత ప్రసన్నకుమార్ కొట్టగా, జైపాల్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీరంగం సతీష్ మాట్లాడుతూ,'సబ్జెక్ట్ వినగానే ఎక్కడా కంప్రోమైజ్ కాకుండా సినిమా చేద్దామని నిర్మాత అన్నారు. రొటీన్ కథకు భిన్నంగా ఈ స్టోరీ ఉంటుంది. జనవరి 15 తరువాత చిత్రీకరణ ప్రారంభించి, మే లో సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపారు. 'ఈ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. బడ్జెట్ ప్రాబ్లెమ్ కాదు, సబ్జెక్ట్ ముఖ్యం అనుకుని ఈ సినిమాని నిర్మిస్తున్నాను. ఈ సినిమా తర్వాత ప్రతి 6 నెలలకు ఓ సినిమాని తీస్తాను' అని నిర్మాత సోమరాజు చెప్పారు. హీరో రవి తేజ్ మాట్లాడుతూ, 'కథ వింటున్నప్పుడే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి. 'ప్రేమఖైదీ', 'ఉప్పెన' సినిమాల్లా అందరికీ నచ్చే సినిమా అవుతుంది' అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ జైపాల్ రెడ్డి, రమణ రియల్టర్, మాస్టర్ చిక్కు తదితరులు ఈ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.