Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు శంకర్ కథానాయకుడిగా స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రానికి 'ఫోకస్' అనే టైటిల్‌ని కన్ఫర్మ్ చేశారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి.సూర్యతేజ దర్శకుడిగా పరిచయ మవుతున్నారు.
సుహాసిని మణిరత్నం కీలక పాత్ర పోషిస్తుండగా, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అషురెడ్డి హీరోయిన్గా నటిస్తోంది.
సినిమాకి టైటిల్ పెట్టిన సందర్భంగా దర్శకుడు సూర్య తేజ మాట్లాడుతూ, ''ఫోకస్' అని టైటిల్ పెట్టడంతోనే మా సినిమాపై ఇండిస్టీతో పాటు ఆడియన్స్ ఫోకస్ కూడా పడింది. మర్డర్ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా చిత్రం వాటంన్నింటికి విభిన్నమైనది. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది' అని తెలిపారు. భాను చందర్, జీవా, షియాజీ షిండే, భరత్ రెడ్డి, సూర్య భగవాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: సత్య. జీ, డీఓపీ: జె. ప్రభాకర్ రెడ్డి, సంగీతం: వినోద్ యజమాన్య.