Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేంద్రప్రసాద్ ఓటీటీ కోసం నటించిన తొలి చిత్రం 'సేనాపతి'. 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందింది. ఈనెల 31న ఆహాలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ఈ సందర్భంగా శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'నాకూ రాజేంద్రప్రసాద్‌కి మధ్య 45 ఏళ్ల అనుబంధం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఇద్దరికీ పనిచేయాలనే తప్పన చావలేదు. డైరెక్టర్ పవన్ సాధినేని రొమాంటిక్ కామెడీ సినిమాలు బాగా చేస్తాడనే పేరుంది. కానీ 'సేనాపతి' వంటి డిఫరెంట్ మూవీని కూడా చేయగలడని నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు అభినందిస్తున్నాను. తను మా గీతాఆర్ట్స్లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ వెరీ గుడ్. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.
'రాజేంద్ర ప్రసాద్ ఇలా కూడా ఉంటాడా? అని 'సేనాపతి' సినిమా చూస్తే అనిపిస్తుంది. నాకంటే యంగర్ జనరేషన్ అయిన టీమ్‌తో పనిచేశాను. వాళ్లు ఇన్స్పిరేషన్ ఇస్తూ వర్క్ చేయించుకున్నారు. ఈ సినిమాతో సరికొత్తగా అలరించబోతున్నాం. హాయిగా ఇంట్లోనే కూర్చుని ఎంజారు చేయాలని కోరుతున్నాను' అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
డైరెక్టర్ పవన్ సాధినేని మాట్లాడుతూ, 'అల్లు అరవింద్గారితో నాకు మంచి అనుంధం ఉంది. రాజేంద్ర ప్రసాద్‌గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని చెప్పారు.
నిర్మాతలు సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ, 'గోల్డ్ బాక్స్ నుంచి చేసిన ప్రతి ప్రాజెక్ట్‌కి కారణం ప్రేక్షకుల ఆశీర్వాదాలే కారణమని భావిస్తాం. ఆహాతో మేం కొలాబ్రేట్ అవుతున్న తొలి ప్రాజెక్ట్ ఇది' అని తెలిపారు.