Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షకలక శంకర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ధర్మస్థలి'. రొచిశ్రీ మూవీస్ బ్యానర్‌పై ఎం.ఆర్.రావు నిర్మిస్తున్నారు. రమణ మోగిలి దర్శకుడు. పావని కథానాయిక. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తున్న సందర్బంగా దర్శకుడు రమణ మోగిలి మాట్లాడుతూ,'షకలక శంకర్‌తో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రాన్ని, ఇలాంటి కాన్సెప్ట్‌ని ఎవరూ తెరకెక్కించలేదు. ప్రతిరోజు మన జీవితాలతో ముడి పడిన ఓ విషయాన్ని, అలాగే మన జీవితాలతో ఆడుకుంటున్న అంశాన్ని ఆయన పాత్ర ద్వారా తెలియజేస్తున్నాం. ఆయనలో ఉన్న కామెడి టైమింగ్ మిస్ కాకుండా ఇంటెన్సిటిని తెరపైకి తీసువస్తున్నాం. పక్కా మాస్ కమర్షియల్ చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జనవరిలో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అని అన్నారు.