Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ పోలిశెట్టి హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంస్థలు సంయుక్త నిర్మాణంలో ఓ చిత్రం రూపొందనుంది. ఆదివారం హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బందం ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య మాట్లాడుతూ, ''వినోదమే పరమా వధిగా నవీన్ పోలిశెట్టి సరికొత్త అవతారం ఈ చిత్రం స్వంతం. ప్రేక్షకులుగా మీరు మరింత సరదాగా నవ్వు కోవడానికి సమాయుత్తమవ్వండి. మేము వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాం. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ సినిమా టైటిల్‌తోపాటు మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడిస్తాం' అని తెలిపారు.