Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'శ్యామ్ సింగ రారు'. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా సోమారం ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో నాని మాట్లాడుతూ, 'ఎలాంటి పరిస్థితులున్నా కూడా మంచి సినిమాను ఆదరిస్తామని ప్రతీ సారి నిరూపిస్తూనే ఉన్నారు. రాహుల్ పట్ల మేం ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. రాజమౌళి గారికి రాహుల్‌ను పరిచయం చేశాను. రాజమౌళి గారే రాహుల్ స్పూర్తి అన్నాడు. డిస్ట్రిబ్యూషన్ సైడ్ మాకు సాయం చేసినందుకు దిల్‌రాజుగారికి థా¸్యంక్స్. మా నిర్మాత వెంకట్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు' అని చెప్పారు.
'గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఇండిస్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు అని అనుకుంటున్న తరుణంలో 'అఖండ, పుష్ప, శ్యామ్ సింగరారు' సినిమాలను నైజాంలో విడుల చేస్తే, మూడు సూపర్ హిట్స్ అయ్యాయి. సినిమాపై ప్యాషన్‌తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇలాంటి విజయాలు ఎన్నో వస్తుంటాయి' అని దిల్ రాజు చెప్పారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ,'నవరాత్రి ఉత్సవాలను, ఆ గొప్పతనాన్ని, కలకత్తా కాళీ నాలుక మహౌన్నత బీభత్సాన్ని ఈ సినిమా ద్వారా ప్రపంచానికి చూపించారు' అని తెలిపారు.
'సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దిల్ రాజు, శిరీష్ గారు నా వెంటే ఉంటూ చేసిన సాయాన్ని మరిచిపోలేను' అని నిర్మాత వెంకట్ బోయనపల్లి చెప్పారు. దర్శకుడు రాహుల్ సంకత్యాన్ మాట్లాడుతూ, 'హిట్, సూపర్ హిట్ అని అంతా అంటారు. కానీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్ క్లాసిక్ అని అంటున్నారు' అని అన్నారు. 'థియేటర్లో ప్రేక్షకుల రియాక్షన్ చూసి ఎంతో సంతప్తి అనిపించింది. సత్యదేవ్, రాహుల్ గారికి థ్యాంక్స్. ఇంత మంచి పాత్రను రాసినందుకు థ్యాంక్స్' అని సాయి పల్లవి అన్నారు.