Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి తనయుడు అనుదీప్ వివాహం స్నికితతో సోమవారం తెల్లవారు జామున రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా చిరంజీవి దంపతులతోపాటు మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో ఎం.డి. చలమల శెట్టి గోపి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.