Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ హర్ష, ప్రియా శ్రీనివాస్, కవిత శ్రీరంగం, అనన్య ప్రాణిగ్రహీ, ఆర్యన్ గౌర, జాన్ కుషాల్, రాకెట్ రాఘవ, జబర్దస్త్ రాము, మణ ిచందన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వధుకట్నం'.
భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్ బాబు సాహేబ్ (బాబుషా) నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర పోస్టర్ను మంచు లక్ష్మి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'పోస్టర్ చాలా కొత్తగా ఉంది. మహిళలు, భ్రూణ హత్యలు మీద ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారు. ఇది మంచి విజయం సాధించాలి' అని తెలిపారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : యస్.డి.జాన్, సంగీతం : ప్రభు ప్రవీణ్ లంక (నాని), కూర్పు : సునీల్ మహారణ.