Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా వరంగల్‌లో జరిగిన చిత్రీకరణ ముగింపు వేడుకలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గెటప్‌లో వచ్చి సినిమాలోని రెండు పాటలకు డాన్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కొండా మురళి జీవించిన జీవితమే నా సినిమా కథ. నా కెరీర్లో కొండా మురళి కంటే బెటర్ సబ్జెక్ట్ 30 ఏళ్లలో దొరకలేదు. నేను అనుకున్నది 20 శాతం తీసినా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది' అని అన్నారు. 'ప్రజల కోసం నేను ఎంత తపన పడతానో, సినిమా కోసం వర్మ అంత తపన పడ్డారు. నా పాత్రలో అదిత్ అరుణ్ బాగా నటించారు. ఆయన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంది. నా మీద ఫైరింగ్ అయ్యే సీన్ చూస్తే, నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సినిమాని మరో మూడు పార్ట్స్ తీయాలని కోరుతున్నాను' అని కొండా మురళి చెప్పారు.
కొండా సురేఖ మాట్లాడుతూ, 'ఒక తపస్సులా ఆర్జీవీ ఈ సినిమా తీశారు. కొండా మురళి జీవితం చాలా మందికి తెలియదు. మేం ముళ్లబాట మీద నడిచి ఈ స్థాయికి వచ్చాం. మేం ఈ స్థాయికి ఎదగడానికి ప్రజలు కారణం. ఈ సినిమాతో మా గురించి ప్రజలకూ పూర్తిగా తెలుస్తుంది. వర్మ మా సినిమా తీయడం అదష్టం' అని తెలిపారు.