Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూజివీడు టాకీస్‌పై రేఖ పలగాని సమర్పణలో వస్తున్న చిత్రం 'ఐరావతం'. ఈ సినిమాలోని 'ఓ.. నా దేవేరి' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా రిలీజైంది.
రామ్ మిర్యాల పాడిన ఈ పాటకు రిలీజైన మొదటి ఇరవై నాలుగు గంటల్లోనే మంచి వ్యూస్ వచ్చాయి. అలాగే ఇంతకు ముందే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి కూడా మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో చిత్ర బృందం గ్రాండ్‌గా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో బిగ్ బాస్ 5 టీమ్‌లో సభ్యులైన నటరాజ్ మాస్టర్, లోబో, మానస్, కాజల్, ప్రణీత్, యాంటీలియా మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ 'నా దేవేరి' పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో,హీరోయిన్లు అమర్ దీప్, తన్వీ మాట్లాడుతూ, 'ఓ సరికొత్త కథలో నటించినందుకు ఆనందంగా ఉంది' అని చెప్పారు.
'కథలోని న్యూ వేవ్ ట్రీట్మెంట్ ఈ సినిమాని నిర్మించడానికి ప్రేరేపించింది. ఇటువంటి కొత్త కథలు చెప్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్‌ని శరవేగంగా నిర్వహిస్తున్నాం' అని నిర్మాతలు రాంకీ సల్లగాని, లలితకుమారి, తోట బాలయ్య చౌదరి చల్లా తెలిపారు. దర్శకుడు సుహాస్ మీరా మాట్లాడుతూ, 'ఈ సినిమాలో ఉన్న ప్రముఖ పాత్రల్లో 'ఐరావతం' అనే ముఖ్య పాత్ర ఎవరిది?, వైట్ కలర్లో ఉన్న కెమెరాని క్లిక్ చేస్తే జరిగే మ్యాజిక్ ఏంటి?, ఈ వైట్ కెమెరా హీరోయిన్ చేతుల్లోకి వచ్చాక ఆమె పడిన ఇబ్బందులు ఏంటి? అనేది చాలా ఎంగేజింగ్‌గా రాసుకున్న స్క్రీన్ ప్లే' అని అన్నారు. 'నా పై నమ్మకం ఉంచి మంచి పాట ఆడియన్స్‌కి అందించేలా సహకరించిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్. ఓ యూనిక్ స్టోరీకి మ్యూజిక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది' అని మ్యూజిక్ డైరెక్టర్ సత్య అన్నారు.