Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'జయ జానకీ నాయక' సినిమాతో నిర్మాతగా పరిచయమై, మొదటి సినిమాతోనే అభిరుచిగల నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు.
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన 'అఖండ' సాధించిన విజయంతో పరిశ్రమలో అగ్ర నిర్మాతగానూ పేరు తెచ్చుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి పుట్టినరోజు నేడు (బుధవారం).
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ''అఖండ' సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని నాకు మొదటి నుంచి నమ్మకం ఉంది. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బాలకష్ణ గారి అభిమానులకు కావాల్సిన మాస్ సాంగ్‌తోపాటు అఘోర పాత్ర అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్‌గా, ప్రతీ సీన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేసినా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందనే నమ్మకం ఉండేది. ఈ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకుడు తమన్ పాత్ర చాలా ముఖ్యమైంది. దాదాపు అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. బాలకష్ణ కెరీర్ మొత్తంలో నైజాం ఏరియాలో అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయి. ఇదే బెంచ్ మార్క్ అయ్యేలా ఉంది. ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలనే కోరిక నాకు కూడా ఉంది. ఒకవేళ హిందీలో రీమేక్ చేస్తే, అజరు దేవగన్, అక్షరు కుమార్ వంటి హీరోలు అయితే బాగుంటుంది. ఇకపై స్టార్ హీరోలతోపాటు అందరితోనూ సినిమాలు చేస్తాను. వచ్చే మార్చిలో ఓ కొత్త హీరోను పరిచయం చేస్తూ సినిమా చేయబోతున్నాను. అలాగే ఒక పెద్ద సినిమా కూడా చర్చల దశల్లో ఉంది. రాజకీయాలపై నాకు ఆసక్తి ఉంది. అయితే ఇప్పుడు నేను ఏ పార్టీలోనూ లేను' అని చెప్పారు.