Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొంది, విడుదలైన 'పుష్ప' చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొంది, ప్రపంచ వ్యాప్తంగా రూ. 280 కోట్లకిపైగా కలెక్షన్లని సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మంగళవారం చిత్ర బృందం 'థ్యాంక్ యూ మీట్'ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మీట్ కొనసాగినంత సేపూ చిత్ర సభ్యులు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఇదొక అరుదైన ఎమోషనల్ థ్యాంక్స్మీట్గా నిలిచింది.
'ఈ రోజు సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కెరీర్లో 'ఆర్య' అనేది ఒక మైలురాయి. సుకుమార్ లేకపోతే ఆర్య లేదు. 'ఆర్య' లేకపోతే నేనులేను. ఈ రోజు నా కెరీర్ ఇంత అద్భుతంగా ఉంది అంటే దానికి కారణం సుకుమార్ అని గర్వంగా చెబుతాను. (అంటూ కన్నీటిపర్యంతమయ్యారు). ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన అందరికీ పేరుపేరునా కతజ్ఞతలు' అని అల్లుఅర్జున్ తెలిపారు.
'పుష్ప' సినిమా తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని రష్మిక మందన అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, 'అల్లు అర్జున్ నాకు దేవుడు. ఆయన చాలా గొప్ప నటుడు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పండించగల సత్తా అల్లు అర్జున్ సొంతం. ఆయనతో మరిన్ని సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాకంటే ఎక్కువ కష్టపడిన లైట్బార్సు, సెట్బార్సు, ప్రొడక్షన్ టీమ్‌లోని అందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున బహుమతిగా ఇస్తున్నాను' అని తెలిపారు.
'జనవరి 6 వరకు ఈ సినిమా కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా 325 కోట్లకు పైగానే కలెక్ట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నాం. మా బ్యానర్‌కు పాన్ ఇండియన్ స్థాయి గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ఇంత పెద్ద విజయం అందించినందుకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కి ధన్యావాదాలు. ఓ మంచి సినిమాని తీశామని మేం గర్వంగా చెప్పుకునేలా చేసిన ప్రేక్షకులకు, అల్లు అర్జున్ అభిమానులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు' అని నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ తెలిపారు.