Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేష్ అగస్త్య, సంజన సారధి జంటగా రూపొందుతున్న చిత్రం 'సరసాలు చాలు'. సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజ కార్యక్రమాలు జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్లో జరిగాయి. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మంత్రి తలసాని తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేయగా, హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు నిర్మాత సతీమణి శతిరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత చంద్రకాంత్ రెడ్డి, రోహిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. 'లూజర్' వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, 'దర్శకుడు సందీప్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాం' అని తెలిపారు.
'ఒక 'చిన్న విరామం' సినిమా తర్వాత చేస్తున్న చిత్రమిది. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్, బ్రీజీ ఎంటర్ టైనర్. కామెడీకి ఇంపార్టెంట్ ఇస్తూ సాగే క్లిన్ ఎంటర్ టైనర్‌గా ఉంటుంది. ప్రతి కపుల్‌కి, రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళకి కనెక్ట్ అయ్యే ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేసి, సమ్మర్లో విడుదల చేస్తాం' అని చెప్పారు.