Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ, ప్రేమని మాత్రమే కోరు కుంటుంది. స్వచ్ఛమైన ప్రేమకు డబ్బు, కులం, మతం, ఆస్తులు, అంతస్తులు అలాగే వయసు కూడా అడ్డంకి కాదు. ఇదే కాన్సెప్ట్‌తో రూపొందిన సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'. జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి గంటలకు ప్రసారమవుతూ ఆశేష ఆదరణ పొందింది.
ముఖ్యంగా ఈ సీరియల్ కోసం కాశ్మీర్‌లోని పహల్గామ్లో చిత్రీకరిం చిన టైటిల్ సాంగ్. మొదట్నుంచీ హిట్ సాంగ్‌గా అలరిస్తోంది. అంతేకాదు ఎంతో మంది ప్రేక్షకులకు కాలర్ ట్యూన్గానూ మారింది. మంచి ప్రొడక్షన్ విలువలతో విజువల్ వండర్‌గా నిర్మించిన ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా గత రెండు సంవత్సరాలుగా ప్రదర్శితమవుతూ వస్తోంది.
ఈ సీరియల్‌పై ఇంతగా ఆదరణ చూపిస్తున్న తమ అభిమాన ప్రేక్షకుల కోసం జీ తెలుగు ఓ అద్భుతమైన బహుమానాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికి ప్రేక్షకులు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ సీరియల్ టైటిల్ సాంగ్‌లో ఆర్యవర్ధన్, అనుగా నటించి మీ విలువలైన, అనిర్వచనీయమైన ప్రేమని చూపించి, బహుమతిని గెల్చుకోండి. జనవరి 1 నుంచి 16 వరకు సాగే ఈ కాంటెస్ట్ కోసం జీ తెలుగు వెబ్‌సైట్‌ని లాగినై, నమోదు చేసుకుని, పాల్గొనండి.