Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉండే దీంట్లో ఓ అమ్మాయి ఉంటుంది. యువ రాణికి ఏమాత్రం తీసిపోదు. సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే ఈనెల 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని అంటున్నారు దర్శక, నిర్మాతలు.
రాశీ ఖన్నా ఓ కథానాయికగా, ఆర్యకు జంటగా నటించిన తమిళ సినిమా 'అరణ్మణై 3'. సుందర్.సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇందులో ఆండ్రియా మరో కథానాయిక. సాక్షి అగర్వాల్, వివేక్, యోగిబాబు, మనోబాల ప్రధాన తారాగణం. హర్రర్, కామెడీగా రూపొందిన ఈ సినిమా తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో 'అంతఃపురం' పేరుతో గంగ ఎంటర్టైన్ మెంట్స్ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సుందర్ సి మాట్లాడుతూ, 'మా 'అరణ్మణై' ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో 'చంద్రకళ', 'కళావతి'గా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ 'అంతఃపురం' కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హర్రర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుందీ సినిమా' అని తెలిపారు.