Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా రంగంలో హిట్లు, ప్లాప్‌లు అనేవి సర్వసాధారణం. అలాగే సక్సెస్ రేట్ ఎప్పుడూ తక్కువే. అయినప్పటికీ సినిమా మీద ఉన్న అపారమైన ప్యాషన్‌తో దర్శక, నిర్మాతలు ఈ ఏడాది కూడా డిఫరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేశారు.
ఈ ఏడాది ఇప్పటివరకు 185 స్ట్రయిట్ తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. అలాగే 46 అనువాద చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించేందుకు బరిలోకి దిగాయి.
కరోనా ఫస్ట్‌వేవ్ కారణంగా గతేడాది కేవలం 65 (50 స్ట్రయిట్ + 15 డబ్బింగ్) సినిమాలు విడుదలైతే, ఈ ఏడాది సెకండ్ వేవ్ భయం ఉన్నప్పటికీ మునుపటి ఉత్సాహాన్ని రీకాల్ చేస్తూ ఏకంగా 185 స్ట్రయిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
దశాబ్దకాలంలో తెలుగునాట ఇన్ని సినిమాలు రావడం ఇది మూడోసారి. 2014లో 194, 2019లో 193 చిత్రాలొచ్చాయి. ఇక డబ్బింగ్ సినిమాల విషయంలోనూ ఈ ఏడాది ఫర్వాలేదనే చెప్పాలి.
గత పదేండ్లలో గత ఏడాది (15), ఈ ఏడాది (45) మాత్రమే తక్కువ సంఖ్యలో అనువాద చిత్రాలు విడుదలయ్యాయి.
కరోనా సెకండ్ వేవ్ భయం ఉన్నప్పటికీ ఈ ఏడాది ఆరంభం నుంచే దర్శక, నిర్మాతలు తమ సినిమాల్ని విడుదల కోసం సిద్ధం చేశారు. నూతన సంవత్సరం కానుకగా నాని నటించిన 'వి', రాజ్‌తరుణ్ 'ఒరేరు బుజ్జిగా', ఎమ్మెస్ రాజు 'డర్టీహరి' విడుదలయ్యాయి. ేఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేనప్పటికీ ప్రేక్షకుల్ని మాత్రం కరోనా భయాలకు అతీతంగా థియేటర్ల వరకు రప్పించగలిగాయి.
ఇక సినిమాల విషయంలో సంక్రాంతి సీజన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. ఈ పండగ బరిలోకి దిగటానికి ప్రతి ఏటా స్టార్ హీరోల సినిమాలు క్యూ కట్టేవి. అయితే ఈ ఏడాది
ఆ రకమైన స్టార్‌వార్ కనిపించలేదు. ఈసారి ఈ పండక్కి రిలీజైన రవితేజ 'క్రాక్' విశేష ఆదరణ పొంది, మంచి కలెక్షన్లని రాబట్టి, తొలి సక్సెస్‌ని నమోదు చేసుకుంది.
ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ లాక్డౌన్ కారణంగా సమ్మర్ సీజన్లో థియేటర్లు మూత పడటం పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
అగ్ర హీరోలు పవన్‌కళ్యాణ్ 'వకీల్‌సాబ్', బాలకృష్ణ 'అఖండ', అల్లుఅర్జున్ 'పుష్ప', నాని 'శ్యామ్ సింగరారు', నాగచైతన్య 'లవ్‌స్టోరీ' వంటి తదితర చిత్రాలు ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. 'నాంది', 'ఎస్ఆర్ కళ్యాణమండపం', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'పెళ్ళిసందడి' వంటి చిత్రాలూ మంచి ఆదరణ పొందాయి. 185 చిత్రాల్లో సుమారు 15 చిత్రాలు మాత్రమే విజయాన్ని దక్కించుకున్నాయి.
నాగార్జున 'వైల్డ్‌డాగ్', రామ్ 'రెడ్', నాని 'వి', నితిన్ 'చెక్', 'రంగ్‌దే', శర్వానంద్ 'శ్రీకారం', గోపీచంద్ 'సీటీమార్', నాగశౌర్య 'వరుడు కావలెను', కార్తీకేయ 'రాజా విక్రమార్క', సాయితేజ్ 'రిపబ్లిక్', వైష్ణవ్‌తేజ్ 'కొండపొలం' వంటి తదితర హీరోల చిత్రాలు భారీ అంచనాలతో విడుదలై, మెప్పించలేక ఫ్లాప్ అయ్యాయి.
ఈ ఏడాది అగ్ర హీరో వెంకటేష్ నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. అలాగే 'మాస్ట్రో', 'థ్యాంక్యూ బ్రదర్', 'సినిమా బండి', 'టక్ జగదీష్', 'పవర్ ప్లే', 'ఏక్ మినీ కథ', 'అద్భుతం', 'డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ', 'ఫ్యామిలీ డ్రామా', 'వివాహ భోజనంబు', 'సూపర్ ఓవర్', 'చిల్ బ్రో', 'ఆకాశవాణి', 'అర్ధశతాబ్దం', 'పచ్చీస్', 'క్యాబ్ స్టోరీస్' వంటి చిత్రాలు ఫర్వాలేదనిపించుకుంటే, సూర్య నటించిన 'జై భీమ్' అపూర్వ ఆదరణ పొందింది.
2021లో తెలుగు సినిమా ఏం సాధించింది?
అని ప్రశ్నిస్తే,కరోనా గిరోనా జాన్తా నై..అంటూ 185 స్ట్రయిట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించి,యావత్ భారతీయ సినిమాకి ధైర్యాన్నిచ్చిందనే దీటైన సమాధానం వస్తుంది. కరోనా సెకండ్ వేవ్ భయాలు..ఏపీలో తగ్గిన టికెట్ ధరలు..దీని కారణంగా మూతపడిన థియేటర్లు..వందశాతం లేని థియేటర్ సీటింగ్ ఆక్యూపెన్సీ.. ఆకాల వర్షాలు, వరదలు..
ఇవేవీ తెలుగు సినిమా దూకుడిని ఆపలేకపోయాయి.భిన్న క్లిష్టపరిస్థితుల్లోనూ ఈ ఏడాది తెలుగు సినిమా సాగించిన ప్రయాణం గురించి..
ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ సినిమాని చూడ్డానికి ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్‌కి వస్తారని, అలాగే సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఊహించని రీతిలో విజయాల్ని, బాక్సాఫీసుల్ని షేక్ చేసే కలెక్షన్లల్ని అందిస్తారని 2021 సంవత్సరం నిరూపించింది.
తెలుగునాట ఆదరణ పొందుతున్న సినిమాలను, వాటి తీరును, అవి రాబడుతున్న కలెక్షన్లు చూసి ఇతర భాషా చిత్ర పరిశ్రమలు స్ఫూర్తి పొందుతున్నాయని చెప్పడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు సినిమా ఇచ్చిన ధైర్యంతో నూతన ఏడాదిలో నూతనోత్సాహంతో సినిమాల్ని రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
అన్ని చిత్ర భాషా పరిశ్రమలకు మార్గదర్శిగా నిలిచిన తెలుగు సినిమా విజయ పరంపరను కొనసాగించేందుకు నూతన సంవత్సరం కానుకగా ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్', సంక్రాంతి కానుకగా ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా సినిమా 'రాధేశ్యామ్' ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తగ్గేదేలా.. అనే రీతిలో రాబోయే నూతన ఏడాదిలోనూ తెలుగు సినిమా తన సక్సెస్ఫుల్ జర్నీని కొనసాగించాలని ఆశిద్దాం..