Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కిన్నెరసాని'. రమణ తేజ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించారు. అన్ షీతల్, మహతి భిక్షు, కశిష్ ఖాన్ నాయికలు.
ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ, 'మన నిజ జీవితంలో జరిగే సంఘటనలకు ప్రతిబింబంలా ఉంటుందీ కథ. ఆయా సందర్భాలకు తగ్గట్లుగా మనిషి ఎలా స్పందిస్తాడనేదే ఈ సినిమా. ఇదొక అందమైన ప్రేమ కథతో రూపొందింది. ఇందులో చాలా ట్విస్ట్లు, మలుపులు ఉన్నాయి. కల్యాణ్ దేవ్ కెరీర్లో ఇదొక మంచి చిత్రమవుతుంది. ఇలాంటి ప్రయోగాత్మక కథను నమ్మిన నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు. 'ఇదొక ఫీల్ గుడ్ సినిమా. దర్శకుడు రమణ మంచి అవుట్పుట్ ఇచ్చారు. జనవరి 26న థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని నిర్మాత రామ్ తళ్లూరి చెప్పారు. నటుడు రవీంద్ర విజరు మాట్లాడుతూ, 'ఇలాంటి సైకో కథ రాయడానికి చాలా గట్స్ ఉండాలి. ఇందులో మంచి పాత్ర పోషించాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని అన్నారు.