Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఖిలాడీ'. సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరిదశలో ఉంది.
ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన రెండు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూడవపాట 'అట్టా సూడకే మత్తెక్కుతాంది ఈడుకే.. ఒంట్లో వేడికే పిచ్చెక్కుతాంది నాడికే'ను విడుదల చేశారు. ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్‌కు దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు సింగర్ సమీరా భరద్వాజ్‌తో కలిసి పాడారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చేలా గీత రచయిత శ్రీమణి సాహిత్యం రాశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రవితేజ, మీనాక్షి చౌదరీ ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ పాట రూపొందింది. నిర్మాతలు ముందుగా ప్రకటించినట్టుగానే ఈ సినిమా ఫిబ్రవరి 11న థియేటర్లోకి రానుంది.
బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతున్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది.